కరీంనగర్లో `డిఆర్ఎఫ్` బృందం ఏర్పాటు

కరీంనగర్ః ప్రకృతి వైపరిత్యాల ద్వారా అనుకోకుండ వచ్చే విపత్తులను ఎదుర్కునేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ హైదరాబాద్ తరహాలో నూతనంగా విపత్తు నిర్వాహాన విభాగాన్ని ఏర్పాటు చేసింది. వివిద విపత్తుల నుండి నగర ప్రజలకు సేవలందించేందుకు 42 మంది సబ్యులతో కూడిన ప్రత్యేక బృంధాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో బాగంగా డిఆర్ఎఫ్ బృంధం సబ్యుల కోసం ప్రత్యేక వాహానాలు… వివిద రకాల పనిముట్లను కొనుగోలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కరీంనగర్ నగరపాలక సంస్థలో మేయర్ సునిల్ రావు, కమీషనర్ వల్లూరు క్రాంతి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హారిశంకర్ తో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ డిఆర్ఎఫ్ వాహానాన్ని ప్రారంభించారు.
56 లక్షలతో కొనుగోలు చేసిన డిఆర్ఎఫ్ వ్యాన్ మరియు విపత్తు సమయంలో వాడే పనిముట్లను పరిశీలించారు. డిఆర్ఎఫ్ సిబ్బందిని పరికరాలు వాడే విధానం, శిక్షాణ నైపుణ్యం తదితర అంశాల పై అడిగి తెలుసుకున్నారు. ఈ విపత్తు నిర్వహాన విభాగం కోసం ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడ కేటాయించారు. అత్యవసర సమయంలో ఆ నెంబర్ కి కాల్ చేసి విపత్తు జరిగిన ప్రదేశం వివరాలను తెలిపితే… డిఆర్ఎఫ్ బృంధాలు రంగంలోకి దిగడం జరుగుతుంది. డిఆర్ఎఫ్ బృంధాలు 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తారు. విపత్తు టోల్ ఫ్రీ నెంబర్ 087 2200100 నెంబర్ ను ప్రకటించారు. అనంతరం నగరపాలక సంస్థ మేయర్ చాంబర్ లో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ హరిశంకర్, నగరపాలక వర్గ సబ్యులు, కో ఆప్షన్ సబ్యులు, ఎస్ఈ కృష్ణ రావు, ఈఈ రామన్ తదితరులు పాల్గొన్నారు.