కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మోడీ తల్లి హీరాబెన్

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హీరాబెన్ మోడీ ఇవాళ (గురువారం) కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి మోడీ తన ట్విటర్ పోస్టులో తెలిపారు. మా అమ్మ ఇవాళ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నదని చెప్పడానికి ఆనందిస్తున్నాను. మీ సమీపంలో ల వ్యాక్సినేషన్‌కు అర్హత కలిగిన వారిని వాక్సిన్ తీసుకునేలా తెలపాల్సిందిగా నేను కోరుతున్నాను అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
Happy to share that my mother has taken the first dose of the COVID-19 vaccine today. I urge everyone to help and motivate people around you who are eligible to take the vaccine.
— Narendra Modi (@narendramodi) March 11, 2021