కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన కామారెడ్డి డిగ్రీ కాలేజ్ అద్యాపకులు

ఇల్చిపూర్: కామారెడ్డి శివార్లలో గల కాలేజీకి చెందిన భూముల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ని సన్మానించిన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎం.చంద్రకాంత్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు డా.టి.శ్రీనివాస్, శరత్ రెడ్డి, డా.శంకర్, సూపరింటెండెంట్ ఉదయ్ భాస్కర్, దేవేందర్ పాల్గొన్నారు.
ముళ్ళపొదలు, ఆక్రమణలతో కూడిన ఈ ప్రాంతంలోని భూముల రక్షణ కోసం రెవిన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో కమిటీ నియమించి తవ్వించిన 1700 మీ. కందకంలో దిమ్మెలు నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.