గణేష్ ఉత్సవ మండపాలపై స‌ర్కార్ కీలక నిర్ణయం

గణేష్ ఉత్సవ మండపాలపై స‌ర్కార్ కీలక నిర్ణయం

 

హైదరాబాద్: క‌రోనా మూలంగా రాష్ట్రంలో జ‌రిగే వినాయ‌క ఉత్స‌వ మండ‌పాల ఏర్పాటుపై తెలంగాణ స‌ర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో క‌రోనా మ‌హ‌మ్మారి రాష్ట్రవ్యాప్తంగా వ‌స్త‌రిస్తున్న వేళ వినాయ‌క ఉత్స‌వాల మండ‌పాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వ‌లేమ‌ని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెహర్రం, వినాయకచవితి కార్యక్రమాలు బహిరంగ ప్రదేశాల్లో జరగనివ్వమని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. కరోనా నేపథ్యంలో వినాయక పూజలు నిరాడంబరంగా నిర్వహించాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ప్ర‌జ‌లంతా ప్ర‌భుత్వ ఆదేశాల‌ను పాఠించాల‌ని కోరింది. ప్ర‌త్యేక ప‌ర‌స్థితుల‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నామని పేర్కొంది.

ఇక మట్టి విగ్రహాలతో పూజించాల‌ని, అవి కేవ‌లం 5 అడుగుల ఎత్తులోపు ఉండాలని గణేష్ ఉత్సవ కమిటీలు ప్ర‌క‌టించాయి. భారీ విగ్రహాలు, సెట్టింగ్‌లు ఏర్పాటు చేయవద్దని గణేష్ ఉత్సవ కమిటీలకు కూడా ఇప్పటికే ఆదేశాలు అందాయి. పూజలో అర్చకునితో పాటు ఒక జంట దంపతులు మాత్రమే కూర్చోవాలని గణేష్ ఉత్సవ కమిటీలు భక్తులకు సూచన చేశాయి.

ఢిల్లీలో గ‌ణేష్ ఉత్స‌వాల‌పై ఆంక్ష‌లు!

న్యూఢిల్లీ : క‌రోనా నేప‌థ్యంలో రానున్న గ‌ణేశ్ విగ్ర‌హాల ఊరేగింపు, నిమ‌జ్జ‌నంపై దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఉన్న‌‌తాధికారులు, ప్ర‌భుత్వాలు దృష్టిసారించాయి. ఈ కోవిడ్ వైర‌స్ మహమ్మారి ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది జాతీయ రాజధానిలోని గణేష్ చతుర్థిపై బహిరంగ ప్రదేశాల్లో పెద్ద సమ్మేళనాలు, స‌మూహ‌ వేడుకలు లేదా విగ్రహ నిమ‌జ్జ‌నం చేయ‌రాద‌ని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ఆదివారం పేర్కొంది. ఎవ‌రైన ఈ నిషేధా‌జ్ఞలు ఉల్లంగిస్తే వారికి రూ. 50 వేల జరిమానా విధించనున్నట్లు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.