గుంటూరులో విషాదం.. 9 నెల‌ల పాప‌తో స‌హా మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

గుంటూరు: గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. మొద‌ట 9 నెల‌ల పాప‌ను విసిరి… త‌ర్వాత తాను దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న శ‌నివారం గుంటూరులో జ‌రిగింది.  గుంటూరుకు చెందిన మనోజ్ఞ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో గుంటూరు వెళ్లిన మనోజ్ఞ అక్కడే ఉంటోంది. ఈ క్రమలో శనివారం తన తొమ్మిది నెలల పాపతో పాటు ఆత్మహత్య చేసుకుంది. మొదట ఐదంతస్తుల భవనం నుంచి పాపను నిర్ధాక్షిణ్యంగా కిందికి విసిరేసింది… ఆవెంట‌నే ఆమె కూడా దూకి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. కాగా ఈ ఘ‌ట‌న‌లో పాప అక్కడిక్కడే మృతిచెందగా.. మనోజ్ఞ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కాగా భర్తే చంపేశాడంటూ మనోజ్ఞ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.