గుజ‌రాత్ ముఖ్య‌మంత్రికి క‌రోనా పాజిటివ్‌

అహ్మ‌దాబాద్: గుజ‌రాత్ రాష్ట్ర సిఎం విజ‌య్ రూపానీకి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. అహ్మ‌దాబాద్‌లో శ‌నివారం జ‌రిగిన ప్ర‌చారస‌భ‌లో మాట్లాడుతూ సిఎం ఉన్న‌టుండి ఒక్క‌సారిగా కింద ప‌డిపోయారు. అధికారులు వెంట‌నే ఆయ‌న‌ను ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స చేయించ‌డంతో కోలుకున్నారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ రూపానీకి అన్ని వైద్య‌ప‌రీక్ష‌లతోపాటు కరోనా ప‌రీక్ష‌లు కూడా చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని విజ‌య్ రూపానీ సూచించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.