తెలంగాణలో స్వ‌ల్పంగా తగ్గిన కరోనా కేసులు

కొత్త‌గా 4,009 క‌రోనా కేసులు.. 14 మ‌ర‌ణాలు

హైదార‌బాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో గ‌డిచిన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. రోజువారీ కేసులు 4 వేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే నిన్నటి కంటే కాస్త తగ్గాయి కేసులు.

రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 83,089 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. కొత్త‌గా 4009 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు సోమ‌వారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. తెలంగాణలో కొత్తగా 14 మంది కరోనాతో మృతి చెందారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌ల‌పి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1838కి చేరింది. క‌రోనా బారి నుంచి తాజాగా1,878 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 3,14,441కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 39,154 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

తాజాగా న‌మోదైన కేసుల్లో జిహెచ్ ఎంసి ప‌రిధిలో 705 కేసులు న‌మోద‌య్యాయి. మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాలో 363, నిజామాబాద్‌లో 360, రంగారెడ్డిలో 336, సంగారెడ్డిలో 264 చొప్పున కేసులు న‌మోద‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.