గొప్ప మ‌న‌సు చాటుకున్న ఎంపీ మాలోతు కవిత

హైదరాబాద్‌ : రోడ్డు ప్ర‌మాదంలో గాయపడ్డ వ్యక్తిని మానవత్వంతో తన వాహనంలో హాస్పిటల్‌కు తరలించి మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత త‌న‌ గొప్ప మ‌న‌సును చాటుకున్నారు. శ్రీరామగిరి స్టేజీ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఎంపీ కవిత హైదరాబాద్‌ నుంచి మహబూబాబాద్‌ వెళ్తుండగా.. ప్రమాద సంఘటను చూసి తన వాహనాన్ని నిలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకొని వెంటనే తన వాహనంలో గాయపడ్డ వ్యక్తిని మహబూబాబాద్‌ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. మానవత్వంతో తన వాహనంలో గాయ‌ప‌డిన వ్య‌క్తిని హాస్పిటల్‌కు తరలించిన ఎంపీని పలువురు అభినందించారు.

 

Leave A Reply

Your email address will not be published.