గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గోడకూలి నలుగురు చిన్నారులు మృతి చెందారు. రాష్ట్రంలోని కట్నీ జిల్లా బన్హారా గ్రామంలో ఓ గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి చెందారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ఇంటి బయట గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది ఘటన స్థలానికి చెరుకున్నారు. మృత దేహాలను స్థానిక ఉమ్రియాపాన్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.