గోవా ఆస్ప‌త్రిలో మ‌రో 13 మంది మృతి

ప‌నాజీ : గోవాలోని వైద్య క‌ళాశాల ఆస్ప‌త్రిలో గ‌త కొన్ని రోజులుగా కోవిడ్ బాధితులు ఆక్సిజ‌న్ అంద‌క‌ ప్రాణాలు కోల్పోతున్నారు. శుక్ర‌వారం మ‌రో 13 మంది చ‌నిపోయిన‌ట్లు ఆ రాష్ట్ర అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ కు తెలియ‌జేశారు. గ‌డిచిన నాలుగు రోజుల నుండి ఈ ఆస్ప‌త్రిలో 70మందికి పైగా చ‌నిపోవడం విచార‌క‌రం.
ఈ ఆస్ప‌త్రిలో గ‌త మంగ‌ళ‌వారం 26 మంది మర‌ణించారు. బుధ‌వారం 20 మంది, గురువారం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంద‌రూ ఆక్సిజ‌న్ అందుబాటులో లేక‌పోవ‌డంతో మ‌ర‌ణించిన‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో గురువారం 2,491 క‌రోనా కేసులు న‌మోదుకాగా.. 63 మంది ప్రాణాలు కోల్పోయారు.

Leave A Reply

Your email address will not be published.