గ్రేటర్ ఎన్నికలు: హైకోర్టు కీలక నిర్ణయం

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన దాఖలైన పిటిషన్‌పై ఈరోజు మరోసారి విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రచనారెడ్డి కోరింది. ఎన్నికల నోటిఫికేషన్లో రిజర్వేషన్లు సక్రమంగా లేవని కోర్టుకు తెలిపింది. అందుకే ఈ రోజు వాదనలు వినాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్‌ను కోరింది. అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని.. ఈ పిటిషన్‌పై ఇప్పుడే విచారణ జరపలేమని హైకోర్టు తెలిపింది. కాగా, రిజర్వేషన్లు రోటేషన్ పద్దతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్టవిరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మున్సిపల్ యాక్ట్ 52Eను కూడా సవాలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబర్ 1న పోలింగ్ నిర్వహిస్తామని, 4న ఫలితాలను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు.