గ్రేటర్ ఫైట్: 1,889 నామినేషన్లు

హైద‌రాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మూడు రోజుల పాటు జ‌రిగిన ఈ ప్ర‌క్రియ‌లో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. శుక్ర‌వారం మధ్యాహ్నం 3 గంటలకే నామినేషన్ల దాఖలు సమయం ముగియగా.. అప్పటి వరకు క్యూలైన్లలో ఉన్నవారికి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు. మొత్తం 1,889 నామినేషన్లు దాఖలు కాగా. ఇవాళ ఒకేరోజు 1,223 నామినేషన్లు దాఖలు చేశారు ఆయా పార్టీల అభ్యర్థులు. మొత్తం 150 వార్డుల నుంచి 1,421 మంది అభ్యర్థులు 1,889 నామినేషన్లు దాఖలు చేసినట్టు అధికారులు ప్రకటించారు.

ఇక మొత్తం దాఖలైన 1,889 నామినేషన్లలో భారతీయ జనతా పార్టీ నుంచి అత్యధికంగా 428 నామినేషన్లు దాఖలు కాగా. టీఆర్ఎస్ పార్టీ నుంచి 424, కాంగ్రెస్ పార్టీ నుంచి 275, తెలుగుదేశం పార్టీ నుంచి 155, ఎంఐఎం నుంచి 58, సీపీఎం నుంచి 17, సీపీఐ నుంచి 12, ఇతరులు 66 నామినేషన్లు దాఖలు చేయగా. స్వతంత్ర అభ్యర్థులు 454 నామినేషన్లు వేశారు.

Leave A Reply

Your email address will not be published.