గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం వైసీపీ కైవసం
విశాఖ: ఆంధ్రప్రదేశ్లోని అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫ్యాన్ దూకుడు కొనసాగగా.. తాజాగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను కూడా వైసీపీ కైవసం చేసుకొంది. మొత్తం 98 స్థానాల్లో 58 చోట్ల వైసీపీ గొలుపొంది గ్రీటర్ పీఠంపై పార్టీ జెండా ఎగురవేసింది. 30 స్థానాలు గెలుచుకుంది టీడీపీ. ఇక జనసేన 3 స్థానాలు గెలువగా.. బీజేపీ 1, సీపీఐ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్లు 4 గెలుపొందారు. అటు విజయవాడ లోనూ వైసీపీ దూసుకుపోతోంది.