`గ్రేటర్` ప్రచారంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు

హైదరాబాద్: హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ (జిహెచ్ ఎంసి) ఎన్నికల ప్రచారంలో కారు జోరు పెంచింది. ఈ ఎన్నికలను అధికార టిఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ 95 డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి ఖాజ సూర్యనారాయణకు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లోని జ్ఞాని జైల్ సింగ్ నగర్ లో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సిఎం కెసిఆర్ అభివృద్ధికి మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముకేష్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్, టిఆర్ఎస్ నాయకులు పల్లె భూమేశ్, ఖజమియ, అంకం మనోజ్, పొలసని సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ బగ్గని రవి, హరీష్ 95 వ డివిజన్ ముఖ్య నాయకులు, టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మంచిర్యాల నాయకులు పాల్గొన్నారు.