చార్మినాద్ వద్ద భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: సంక్రాంతి పండుగ ద్వారా అందరికీ శుభం కలగాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ వద్ద తెలంగాణ జాగృతి నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది నుంచి ప్రపంచాన్ని వెంటాడుతున్న కరోనా మహమ్మారి పీడ ఈ భోగి మంటల్లో కాలిపోవాలని కోరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెలో భోగి మంటల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.