చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సుశీల్ చంద్ర
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా (సిఇసి) సుశీల్ చంద్ర మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 24వ సిఇసిగా సుశీల్ చంద్రను నియమిస్తూ సోమవారం కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత సిఇసి సునీల్ అరోరా సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో అత్యంత సీనియర్ కమిషనర్గా ఉన్న సుశీల్చంద్రను నూతన సిఇసి గా కేంద్రం నియమించింది. సుశీల్ చంద్ర 2022 మే 14 వరకు పదవిలో కొనసాగుతారు.