చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సమీక్ష

హైదరాబాద్: చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పై బుధవారం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. చెన్నూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి లక్ష ఎకరాలకు సాగునీరు అందించే అంశంపై ఈ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ రమేష్, ఎస్ఈ విష్ణుప్రసాద్, ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ శారద, జేఈ వికాస్ రెడ్డి, ఆర్‌వీ సంస్థ ప్రతినిధులు సారధి, ఆనంద్ పాల్గొన్నారు.