చెప్పు దెబ్బలు తిన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
లక్నో: లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న కారణంతో ఇద్దరు యువతులు ఉత్తరప్రదేశ్‌లోని జలాన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అనుజ్ మిశ్రాను ఆదివారం చెప్పుదెబ్బలతో దేహశుద్ధి చేశారు. అందరూ చూస్తుండగానే చితకొట్టారు. ఈ ఘటన యుపిలోని జలాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. జలాన్‌కు చెందిన అనూజ్ మిశ్రా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం అనూజ్ మిశ్రా జలాన్ సమీపంలోని ఒరై రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఇంతలో స్టేషన్‌వైపు వస్తున్న ఇద్దరు యువతులపై అనూజ్‌మిశ్రా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈవ్ టీజింగ్‌కు పాల్పడడమే గాకుండా లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆగ్రహించిన సదరు యువతులు అనూజ్ మిశ్రాను పట్టుకొని తమ చెప్పులతో దేహశుద్ది చేశారు. క్షమాపణలు చెప్పమనడంతో ఆయన వారి కాళ్లపై పడి ప్రాథేయపడ్డారు. ఒరై రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు అనూజ్ మిశ్రాను విడిపించి అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Bringing this in your notice … the man is #AnujMishra INC Dist President of #Jalaun @priyankagandhi @AjayLalluINC pic.twitter.com/MNC21hEwf7
— Mohammad Shadab مُحَمَّد شاداب (@skaifi) November 1, 2020