చెరువులో శవమైన నాలుగేళ్ల చిన్నారి
సంగారెడ్డి: నాలుగేళ్ల చిన్నారి చెరువులో శవమై కనిపించింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో ఆదివారం ఈ ఘటన వెలుగుచూసింది. చిన్నారిని గ్రామానికి చెందిన కటికె మస్తాన్ కూతురిగా పోలీసులు గుర్తించారు. పాప మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు