చౌటుప్పల్‌లో ద్విచక్ర వాహనాల ఢీ.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌: రెరండు ద్విచ‌క్ర‌వాహనాలు ఎదురెదురుగా వ‌చ్చి ఢీకొన‌డంతో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతిచెందారు. ఈ ఘ‌ట‌న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. చౌటుప్ప‌ల్‌కు చెందిన మ‌ణికంఠ దివిస్ కంపెనీలో ప‌ని చేస్తున్నాడు. రోజులాగే ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఉయం కూడా బైక్‌పై విధుల‌కు బ‌య‌లుదేరాడు. అదే స‌మ‌యంలో అంకిరెడ్డి గూడెంకు చెందిన క‌సుజీత్‌రెడ్డి త‌న స్నేహితుడితో క‌లిసి చౌటుప్ప‌ల్ వైపు ద్విచ‌క్ర‌వాహ‌నంపై బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలో చౌటుప్ప‌ల్ శివారులో ఎదురెదురుగా వచ్చిన ఇద్దరు ద్విచక్ర వాహనదారులు ప్రమాదవశాత్తు ఒకరినొకరు ఢీకొట్టకున్నారు. ఈ ప్ర‌మాదంలో మ‌ణికంఠ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. గాయ‌ప‌డిని ఇద్ద‌రి హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ సుజీత్ మ‌ర‌ణించాడు. సమాచారం అందుకున్న సిఐ శ్రీ‌నివాస్ అక్కడికి చేరుకొని… సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.