జనగామలో నడిరోడ్డుపై మాజీ కౌన్సిలర్ హత్య!

జనగామ: జిల్లా కేంద్రంలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇవాళ (గురువారం) ఉదయం 6 గంటల సమయంలో జనగామ మాజీ కౌన్సిలర్ పులిస్వామిని గుర్తు తెలియని దుండగులు జనగామ కేంద్రంలోని హనుమకొండ రోడ్డు నేషనల్ వెల్ఫేర్ స్కూల్ ఎదురుగా హత్య చేశారు. వాకింగ్ కు వెళ్లి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. మాటువేసిన ఇద్దరు వ్యక్తులు పులిస్వామిని కిరాతకంగా దాడిచేసి హత్య చేశారు. హత్య చేసిన తరువాత దుండగుల బైక్ స్టార్ట్ కాకపోవడంతో దానిని అక్కడే వదిలేసి పరారయ్యారు. పులిస్వామి హత్య ఘటన వెనుక భూవివాదాలు కారణం అయ్యి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా పులిస్వామి 2005లో తెలుగుదేశం పార్టీ తరపున కౌన్సిలర్ గా పనిచేశారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.