జీవిత ఖైదుకు అర్హుడే: న్యూజిలాండ్ ప్రధాని

వెల్లింగ్టన్: ముమ్మాటికీ జీవిత ఖైదు శిక్షకు అర్హుడే.. 51 మంది మృతికి కారణమైన ఉగ్రవాది పేరు వినడం కూడా ఇష్టంలేదు అని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ అన్నారు. గత ఏడాది మార్చిలో క్రిస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో ఉగ్రవాదులు కాల్పులు జరపడం.. ఆ ఘోరఘటనలో మొత్తం 51 మంది ముస్లింలు మరణించిన సంగతి ప్రపంచమంతా తెలిసిందే. అయితే తాజాగా ఆ దుండగుడికి స్థానిక కోర్టు జీవిత ఖైదుని విధించడాన్ని ప్రధాని జెసిండా స్వాగతించారు. జీవిత కాల శిక్షకు అతను ఖచ్చితంగా అర్హుడేనని అన్నారు. మార్చి 15 నాటి దాడికి చెందిన గాయం అంత తేలికగా నయం కాలేదని, దానికి కారణమైన ఉగ్రవాది పేరు వినడం కూడా ఇష్టంలేదని ఆమె అన్నారు.