జూలై 1 నుంచి సిండికేట్‌ బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు మారనున్నాయి..

బెంగళూరు (CLiC2NEWS): 2020 ఏప్రిల్‌లో సిండికేట్ బ్యాంక్‌తో విలీనం అయిన తరువాత కెనరా బ్యాంక్ దేశంలో నాల్గవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవ‌త‌రించింది. బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా సిండికేట్‌ బ్యాంక్‌ కెనరా బ్యాంక్‌లో విలీనం అయిన సంగతి తెలిసిందే.

అయితే సిండికేట్‌ బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు జులై 1 నుంచి మారనున్నాయి. నెఫ్ట్‌/ఆర్టీజీఎస్‌/ఐఎంపీఎస్‌ మార్గాల ద్వారా నగదు లావాదేవీలకు ఇకపై కెనరా బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను వినియోగించాల్సి ఉంటుంది.

కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను పొందేందుకు తమ బ్యాంక్‌ వెబ్‌సైట్‌ను గానీ (canarabank.com/IFSC.html), తమ బ్యాంక్‌ బ్రాంచ్‌ను గానీ ఖాతాదారులు సంప్రదించాలని కెనరా బ్యాంక్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే  ఖాతాదారులు మారిన ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, ఎంఐసీఆర్‌ కోడ్‌లతో కూడిన చెక్‌ బుక్‌లను తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. విదేశీ లావాదేవీలకు CNRBINBBFD స్విఫ్ట్‌ కోడ్‌ను వాడాల్సి ఉంటుందని కెనరా బ్యాంక్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.