జెఇఇ అడ్వాన్స్డ్‌ ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ : జెఇఇ అడ్వాన్స్డ్‌ ఫలితాలను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటి) ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల్లో పుణేకు చెందిన చిరాగ్‌ ఫలోర్‌ మొదటి ర్యాంకు దక్కించుకున్నాడు. 352 మార్కులతో ఆల్‌ ఇండియా టాపర్‌గా నిలిచాడు. ఐఐటీ బాంబే జోన్‌ నుంచి అతడు జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష రాశాడు. కాగా 317 మార్కులతో కనిష్కా మిట్టల్‌ అనే విద్యార్థిని బాలికల విభాగంలో మొదటి స్థానం దక్కించుకుంది.
కాగా … రెండవ ర్యాంకును గంగుల భువన్ రెడ్డి, 3 వ ర్యాంకు బీహార్ కు చెందిన వైభవ్ రాజ్ సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ జెఇఇఅడ్వాన్స్డ్‌ .ఎసి.ఇన్‌లో చూడవచ్చు. జెఇఇ మెయిన్‌లో చిరాగ్‌ ఈ ఏడాది 100 శాతం మార్కులతో 12వ ర్యాంకు సాధించారు. బాలికల విభాగంలో 99.99 శాతంతో ఢిల్లీకి చెందిన ఎరా సాద్రా టాప్‌లో నిలిచారు. ఆల్‌ ఇండియా ర్యాంకులో 79వ ర్యాంకు సాధించారు. jeeadv.ac.in లో ఫలితాలు తిలకించవచ్చు.
కాగా 2020 సంవ‌త్సరానికి గాను ప్రతిష్ఠాత్మక ‘బాల పురస్కార్‌’ అవార్డును చిరాగ్‌ ఫలోర్‌ దక్కించుకున్నాడు. ప్రధాని మోదీ ఈ అవార్డును అంద‌జేశారు. ఈ విషయాన్ని ప్రధాని తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.