జ్యోతిరావు పూలేకు ముఖ్య‌మంత్రి జగన్‌ నివాళి

తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్ కన్వీనర్ జంగా కృష్ణమూర్తి, ఎంపీ మిథున్ రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే జోగి రమేష్ పాల్గొన్నారు.

“అణ‌గారిన వ‌ర్గాల ఆశాజ్యోతి, స్త్రీ విద్య‌కు బాట‌లు వేసిన మ‌హ‌నీయులు.. ఎస్సీ,ఎస్టీ, ఓబీసీల సంక్షేమం కోసం ప‌నిచేసిన నాయ‌కుడు మ‌హాత్మా జ్యోతిబా ఫూలే. ఆయ‌న చూపిన బాటలో న‌డుస్తూ అంద‌రి సంక్షేమ‌మే ల‌క్ష్యంగా పాల‌న చేస్తున్నాం. నేడు మ‌హాత్మా జ్యోతిబా ఫూలే జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు.“అని ముఖ్య‌మంత్రి జగన్‌ ట్వీట్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం కోసం పనిచేసిన నాయకుడని కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.