టిఆర్ఎస్ కార్యకర్త పాడె మోసిన హరీష్‌రావు

సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి మనస్తాపం చెంది టిఆర్ ఎస్ పార్టీ కార్యకర్త కొత్తింటి స్వామి నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. విషయం తెలసుకున్న మంత్రి హరీష్‌రావు గ్రామానికి చేరుకుని స్వామి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. మంత్రితోపాటు ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి పాడె మోశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని.. కార్యకర్తలు ఎవరూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త స్వామి కుటుంభానికి పార్టీ అండగా ఉంటుందని హరీష్‌రావు భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున రూ.2 లక్షలు అందించామని.. రానున్న రోజుల్లో వారి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. స్వామి భార్యకు, పిల్లలకు కుటుంబానికి అండగా ఉంటామన్నారు.