టిడిపికి గద్దె బాబూరావు రాజీనామా

విజయనగరం : టిడిపికి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీకోసం అంకిత భావంతో పనిచేశానని, అయితే అప్పటి టిడిపికి, ఇప్పటి టిడిపికి చాలా తేడాలు ఉన్నాయని అన్నారు. 2004 నుండి పార్టీలో పనిచేస్తున్నప్పటికీ.. తాను ఉన్నానో, లేనో కూడా టిడిపి నాయకత్వం గుర్తించే పరిస్థితిలో లేదని అన్నారు. ఆత్మ గౌరవం.. ఆత్మ స్థైర్యం ప్రస్తుతం పార్టీలో లేవని, అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చానని, చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న నేను, ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన తర్వాత టిడిపిలో చేరానని, అక్కడ నుంచి ఆయన అడుగు జాడల్లో నడిచాను. 2004 నుంచి ఇప్పటివరకూ గద్దె బాబూరావు ఉన్నాడో లేడో కూడా టీడీపీ నాయకత్వం గుర్తించడం మానేసింది. నాకు ఎవరి మీద విమర్శలు చేయడం ఇష్టం లేదు. ఆత్మ గౌరవము, ఆత్మ సంతృప్తి కోల్పోయిన తర్వాత చాలా బాధ కలిగి ఇవాళ టీడీపీకి రాజీనామా చేస్తున్నా. అని స్ప‌ష్టం చేశారు. కాగా, గద్దె బాబూరావు ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా విధులు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.