టి. వేదాంత సూరి: న్యూజిలాండ్ లో ఎన్నికలు

న్యూజిలాండ్ లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి… ఇక్కడ ఎన్నికలకు ప్రచార హోరు అసలే ఉండదు.. ఖర్చూ ఉండదు.. వీధుల కూడళ్లలో హోర్డింగులు మాత్రం కనిపిస్తాయి. ఈ నెల మూడు (నేటి) నుంచి 17వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరు రెండు ఓట్లు వేయాలి. ఒకటి అభ్యర్థికి, మరొకటి పార్టీకి. తమ నివాసానికి సమీపం లోని బూత్ లో ఓటరు కార్డు చూపి బ్యాలెట్ పేపర్ తీసుకుని పెన్ తో టిక్ చేస్తే సరి పోతుంది.
ఈ సందర్బంగా రెండు అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నారు. ఒకటి గుడుంబా నిషేధ చట్టం పై అభిప్రాయం, రెండు అనారోగ్య పరిస్థితులు తట్టుకోలేక, మరణించే హక్కుకు అవకాశం కలిగించడం.. పై అభిప్రాయాన్ని తెలియ చేయాలి. ఈ ఎన్నికలపై ఎక్కడా హంగామా ఉండదు.. పౌరులందరికీ అవగాహన ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి వారో తెలుసుకుంటారు.. తరువాత తమ ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేస్తారు. చూడాలి. మళ్ళీ ఎవరు గెలుస్తారో.