ట్విట్టర్లో పోస్టు చేసిన మహేష్‌బాబు
ట్విట్టర్లో పోస్టు చేసిన మహేష్‌బాబు

‘మిస్టర్ కూల్’.. టీమ్ ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ ధోని శనివారం తన రిటైర్మెంట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ధోని అనూహ్య నిర్ణయంతో యావత్ క్రీడా లోకం ఆశ్చర్యంలో మునిగింది. అభిమానులు ఈ విషయాన్ని జీర్నించుకోలేకపోతున్నారు… భవిష్యత్ బావుండాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఆశిస్తున్నారు. అభిమానులే కాదు క్రికెటర్లు, తదితర రంగాలకు చెందిన సెలబ్రెటీలు కూడా నివ్వెరపోయారు. ఆయనకు సోషల్ మీడియాలో స్పందనలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. ‘2011లో ఇండియాను క్రికెట్ విశ్వవిజేత నిలిపిన ఆ ఐకానిక్ సిక్సర్‌ను నేను ఎలా మరచిపోగలను! నేను ఆ సమయంలో వాంఖేడియం స్టేడియంలోనే నిలుచున్నాను. గర్వంగా ఉంది. కన్నీళ్లు వస్తున్నాయి. క్రికెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. టేక్ ఎ బౌ ఎం.ఎస్.ధోని’’ అని సూపర్‌స్టార్ మహేశ్ మహేష్ పోస్టు చేశారు.
