డిసెంబ‌ర్ 8 నుంచి స‌రుకుల‌ రవాణా బంద్‌!

న్యూఢిల్లీ: వ‌్య‌వ‌సాయ చ‌ట్టాలను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న రైతుల‌కు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 8 నుంచి ఉత్తర భార‌తదేశంలో స‌రుకు ర‌వాణా వాహ‌నాల‌ను బంద్ చేస్తున్న‌ట్లు ఏఐఎంటీసీ స్ప‌ష్టం చేసింది. ఆ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌క‌పోతే మొత్తం దేశ‌వ్యాప్తంగా స‌రుకు ర‌వాణాను నిలిపేస్తామ‌ని హెచ్చ‌రించింది. దేశంలో సుమారు కోటి స‌రుకు ర‌వాణా వాహ‌నాల ఆప‌రేట‌ర్లు ఈ ఏఐఎంటీసీలో స‌భ్యులుగా ఉన్నారు. డిసెంబ‌ర్ 8 నుంచి ఢిల్లీ, హ‌ర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, హిమాచ‌ల్‌, జ‌మ్ముక‌శ్మీర్‌తోస‌హా అన్ని ఉత్త‌రాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో త‌మ వాహ‌నాల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ఏఐఎంటీసీ అధ్య‌క్షుడు కుల్త‌ర‌న్ సింగ్ అత్వాల్ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.