ఢిల్లీకి వెళ్లిన మాజీమంత్రి ఈటల

హైదరాబాద్ (CLiC2NEWS): మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ బయలుదేరారు. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొని తెలంగాణ మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్‌కు గురైన విషయం తెలిసిందే. తాజాగా ఈటల రాజేందర్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీలో చేరతారన్న ఊహాగానాల వినిపిస్తున్న నేపథ్యంలో ఈటల హస్తినకు వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈటల ఢిల్లీలో రేపు ఉదయం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా తదితర బిజెపి అగ్రనేతలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.