తిరుపతి ఉప ఎన్నిక.. టిడిపి అభ్యర్థిగా పనబాక లక్ష్మి

తిరుపతి: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలలో పోటీ చేయనున్న తమ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన పనబాక లక్ష్మి మళ్ళీ అభ్యర్థిగా అధికారికంగా సోమవారం ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో వీడియో కాన్ఫరన్స్‌ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభకు పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన పనబాక లక్ష్మినే మళ్లీ అభ్యర్థిగా నిర్ణయించినట్లు చంద్రబాబు నేతలతో చెప్పారు. అభ్యర్థి విజయం కోసం శ్రేణులంతా కష్టించి పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు. వైసిపికి చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ అనార్యోంతో మృతిచెందడంతో ఉప ఎన్నిక జరగనుంది.

Leave A Reply

Your email address will not be published.