తిరుపతి వెంకన్న మొక్కు తీర్చుకున్న ఎంపీ సంతోష్ కుమార్

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఎంపీ సంతోష్‌ కుమార్‌ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌తోపాటు ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్‌ శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీ‌వారి దర్శనానంతరం హరితాన్నే ఆ స్వామి వారికి కానుకగా సమర్పించుకున్నడు. పచ్చని మొక్కను నాటి తన మొక్కును తీర్చుకున్నడు ఎంపీ..సంతోష్ కుమార్ జోగినపల్లి.
అంతకుమందు ఎంపీ సంతోష్‌ కమార్‌కు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆలయం వద్ద స్వాగతం పలికారు.

Leave A Reply

Your email address will not be published.