తెలంగాణలో కొత్తగా 293 కరోనా కేసులు
హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో ఇవాళ 535 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసులు సంఖ్య 2,87,108 కు చేరింది. వీరిలో 2,79, 991 మంది కోలుకున్నారు. మరో 5,571 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్లో 3,418 మంది ఉన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ల కారణంగా ఇవాళ్టివరకు 1,546 మంది మృత్యువాతపడ్డారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 26,590 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 69,51,297 మందికి పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
