తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 152 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,406కి చేరింది. ఈ మేరకు గురువారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,95,211 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1948 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా కరోనాతో ఇద్దరు మృతిచెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 1637కి చేరిందని అధికారులు వెల్లడించారు.