తెలంగాణలో కొత్త‌గా 166 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణలో రాష్ట్రంలో తాజాగా 166 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,572కి చేరింది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉద‌యం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బుటిలెన్ విడుద‌ల చేసింది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1639కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 2,95,970 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా ప్ర‌స్తుతం 1963 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.