తెలంగాణలో కొత్త‌గా 204 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంటల వ్య‌వ‌ధిలో 204 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజాకేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,522 కు పెరిగింది. అలాగా తాజాగా రాష్ట్రంలో ఇద్దరు కరోనాతో మృతిచెందారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,656 మంది మృతిచెందారు. ఇదే సమయంలో 170 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు అధికారులు బులెటిన్‌లో పేర్కొన్నారు. రికవరీ కేసులు 2,97,851 కు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2015 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.