తెలంగాణలో కొత్తగా 551 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 551 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒకరు మృతి చెందారు. తాజాగా 682 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,195కు చేరగా, 2,71,649 మంది రికవరీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1506 మంది మృతిచెందారు. ఇక, కరోనా మృతుల సంఖ్య తెలంగాణలో 0.53 శాతంగా ఉంటే దేశవ్యాప్తంగా 1.5 శాతంగా ఉంది. రికవరీ రేటు రాష్ట్రంలో 96.94 శాతానికి పెరిగితే, దేశంలో 95.4 శాతంగా ఉందని కోవిడ్ బులెటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,040 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 4,955 మంది హోం ఐసోలేషన్‌లేనో ఉన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 47,991 కరోనా టెస్ట్‌లు నిర్వహించగా ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 63,54,388కు చేరినట్టు ప్రభుత్వం వెల్లడించింది.