తెలంగాణలో కొత్త‌గా 925 కరోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 42,077 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 925 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,62,653కు చేరింది. ఈ మేర‌కు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శ‌నివారం ఉద‌యం బులిటెన్ విడుద‌ల చేసింది. ఇదే సమయంలో 1,367 మంది రికవరీ కాగా.. ముగ్గురు మృతిచెందారు.. మరోవైపు రికవరీ కేసులు 2,49,157కు పెరగగా.. ఇప్పటి వరకు కరోనా బారినపడి 1426 మంది మృతిచెందినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక, కరోనా మృతుల శాతం దేశవ్యాప్తంగా 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతానికి పడిపోయింది… రికవరీ రేటు దేశంలో 93.6 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 94.86 శాతంగా ఉంది.. ప్రస్తుతం 12,070 యాక్టివ్‌ కేసులు ఉండగా.. అందులో 9,741 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.. మరోవైపు.. గత 24 గంటల్లో 42,077 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 50,92,689కు పెరిగింది.

Leave A Reply

Your email address will not be published.