తెలంగాణలో మూడు వేలు దాటిన కేసులు

హైద‌రాబాద్‌:రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,187 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య‌ రోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలోఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,27,278కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 3,05,335 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 20,184 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో తెలంగాణలో కరోనాతో కొత్తగా ఏడుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1759కి చేరిందని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.