తెలంగాణలో 2 వేలు దాటిన కరోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు వేయిలోపే నమోదవుతున్న కేసులు 2వేలు దాటాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్తగా 2055 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు గురువారం ఉద‌యం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,704 కి చేరింది. కరోనా బులెటిన్ ప్రకారం నిన్నటి రోజున 303 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజా డిశ్చార్జిల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం 3,03,601 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 13,362 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధితో కరోనాతో ఏడుగురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1741కి చేరిందని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.