తెలంగాణ‌లోని కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయండి..

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 35 కేంద్రీయ విద్యాలయాల్లో 249 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఆ ఉపాధ్యాయ ఖాళీలను వెంట‌నే భర్తీ చేయాలని కేంద్ర స‌ర్కార్‌ను చేవెళ్ల ఎంపి జి.రంజిత్ రెడ్డి కోరారు. ఈ విష‌యంపై మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మ్యాటర్ అండర్ రూల్-377(స్పెషల్ మెన్షన్)లో సంబంధిత కేంద్ర విద్యా శాఖ మంత్రిని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 35 కేంద్రీయ విద్యాల‌యాల్లో 1208 మంది ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉండగా 959 మంది మాత్ర‌మే రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.