తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తొలి ఎమ్మెల్యే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా తొలి టీకా వేయించుకున్న తొలి ఎమ్మెల్యేగా జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ నిలిచారు. ప్రైవేట్ వైద్యులకు కరోనా వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కరోనా వ్యాక్సిన్ టీకా ను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వేయించుకున్నారు. కాగా రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. నేటి (సోమవారం) నుంచి రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలోనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా టీకా తీసుకున్నారు. జగిత్యాలలోని జిల్లా ప్రధాన తన ఆస్పత్రిలో సోమవారం ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా పంపిణీని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కూడా టీకా వేసుకున్నారు. ఆయనకు ఆస్పత్రి వైద్యులు అత్యంత జాగ్రత్తతో టీకా వేశారు.