తెలంగాణలో కొత్తగా 415 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 415 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,354కు చేరింది. ఇందులో 2,78,839 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 1541 మంది బాధితులు మరణించారు. మరో 5974 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 3823 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, బుధవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 316 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో ముగ్గురు బాధితులు మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53 శాతం, రికవరీ రేటు 97.37 శాతంగా ఉన్నదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 43,413 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు 68,82,694 నమూనాలకు పరీక్షలు చేశారు. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 91, రంగారెడ్డి జిల్లాలో 43, మేడ్చల్ మల్కాజిగిరిలో 39, కరీనంగర్‌లో 33, వరంగల్ అర్బన్ జిల్లాలో 31 చొప్పున ఉన్నాయి.