తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎంసెట్ 2020 ఫలితాలు విడుదలయ్యాయి. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్‌లో విద్యాశాఖ మండలి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో 89,734 మంది(75.29 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం www.ntnews.com వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,43,326 మంది దరఖాస్తు చేసుకోగా, 1,19,183 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 89,734 మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈసారి మొదటి పది ర్యాంకులు అబ్బాయిలే సాధించారు. వారణాసి సాయితేజకు మొదటిఫస్ట్ ర్యాంక్ రాగా, యశ్వంత్ సాయి-రెండో ర్యాంక్, వెంకటకృష్ణ-మూడో ర్యాంక్ సాధించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ జరిగిందన్నారు. విద్యార్థుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ముందుగా చెప్పినట్లు, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లతో పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు.