తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల

వరంగల్‌: తెలంగాణ ఐసెట్‌- 2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి విడుదల చేశారు. ఐసెట్‌కు 41,506 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఐసెట్‌కు 90.28 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. 45,975 మంది విద్యార్థులు ఐసెట్‌ పరీక్ష రాశారు.

తొలి పది ర్యాంకులు సాధించిన విద్యార్థులు

ఐసెట్‌లో మొదటి ర్యాంకును హైదరాబాద్‌లోని ఎస్సానగర్‌కు చెందిన బి శ్రీభశ్రీ 159.5 మార్కులతో మొదటి ర్యాంకును సాధించినట్లు ప్రకటించారు. రెండో ర్యాంకు సందీప్‌ 144.50 (ఆర్మూర్‌, నిజామాబాద్‌), మూడో ర్యాంకు అవినాశ్‌ సిన్హా 142.43 (హైదరాబాద్‌), నాలుగు ర్యాంకు ప్రసన్న లక్ష్మి 142.45 (వరంగల్‌), ఐదో ర్యాంకు మదరవోని శ్రీకృష్ణ సాయి 141.40, (రంగారెడ్డి)ఆరో ర్యాంకు తిప్పర్తి అఖిల్‌రెడ్డి 140.933 (రంగారెడ్డి), ఏడో ర్యాంకు డి జయదీప్‌ 140.22 ( వెస్ట్‌ బెంగాల్‌), ఎనిమిదో ర్యాంకు పాటి అఖిల్‌రెడ్డి 139.11 ( నెల్లూరు ఆంధ్రప్రదేశ్‌), తొమ్మిదో ర్యాంకు వీఎస్‌ రాజేఖర్‌రెడ్డి 136.50 (గుంటూరు- ఏపీ), పదో ర్యాంకు మహ్మద్‌ సొహైల్‌ 135.86 (భద్రాద్ది కొత్తగూడెం) సాధించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ వివరించారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పురుషోత్తం, ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.