తెలంగాణ రాష్ట్రానికి 2 రాష్ర్టపతి పోలీసు పతకాలు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పతకాలు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణకు 2 రాష్ర్టపతి పోలీసు పతకాలు దక్కాయి. అలాగే మరో 12 పోలీసు పతకాలు దక్కాయి. హైదరాబాద్ అదనపు సీపీ శిఖా గోయల్‌కు, నిజామాబాద్ ఐజీ శివశంకర్ రెడ్డికి రాష్ర్టపతి పోలీసు పతకాలు వరించాయి. మరో 12 మందికి పోలీసు పతకాలు దక్కాయి.