తెలంగాణ హై కోర్టు సీజేగా హిమ కోహ్లీ

న్యూఢిల్లీ: టీఎస్ హైకోర్టు చీఫ్‌గా జస్టిస్ హిమా కోహ్లీ నియామకం అయ్యారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న హిమా కోహ్లీ పదోన్నతిపై హైదరాబాద్ రానున్నారు. మరో వైపు ప్రస్తుత తెలంగాణ చీఫ్ జస్టిస్ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో రాష్ట్రపతి విడుదల చేయనున్నారు. ఇక కొత్త హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ విషయానికి వస్తే.. ఆమె 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. 1979లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి హిస్టరీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆనర్స్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. 1984లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో కోహ్లీ లా ప్రాక్టిస్ మొదలు పెట్టారు. 2006 మే 29న ఆమె ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007 ఆగస్టులో పూర్తి స్థాయి న్యాయమూర్తిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. తాజాగా.. హిమా కోహ్లీ తెలంగాణ హైకోర్టు చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.