తెలుగు ప్రజలకు ఎపి సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, మనకంటూ ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని అన్నారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, పైరుపచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకొచ్చాయని అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని సీఎం పేర్కొన్నారు.