తొలిసారి ఐప్యాడ్‌లో బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2021ని మరికొద్ది సేపట్టో ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. చరిత్రలో తొలిసారిగా ఈ సారి కేంద్ర బడ్జెట్ పేపర్‌లెస్‌గా ఉండబోతోంది. కరోనా వేళ కేంద్ర బడ్జెట్ ప్రతులు ముద్రణ చేయలేదు. దాంతో ఈ సారి బడ్జెట్ డిజిటల్ అవతారమెత్తింది. దాంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పత్రాలకు బదులు ల్యాప్‌టాప్‌తో పార్లమెంటుకు బయలుదేరారు.
ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ఇవాళ (సోమవారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ఐప్యాడ్ ద్వారా మంత్రి 2021-22 బడ్జెట్‌ను చదవి వినిపించనున్నారు. ఎర్రటి బ్యాగులో ఐప్యాడ్ ట్యాబ్లెట్‌తో మంత్రి నిర్మల సీతారామన్ కనిపించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా మంత్రి సీతారామన్‌తో రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు.
తొలిసారి బడ్జెట్ ప్రతులు లేకుండా..
1947 నవంబరు 26న తొలిసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఏటా బడ్జెట్ పత్రాలు ముద్రణ చేపడుతున్నారు. అయితే ఈసారి కరోనా మూలంగా బడ్జెట్ ముద్రణ చేపట్టలేదు. కాగా రెడ్ కలర్ బ్యాగులో ట్యాబెలట్‌ను మంత్రి సీతారామన్ పార్లమెంట్‌కు తీసుకువెళ్లారు. ఆ బ్యాగుపై గోల్డ్ కలర్‌తో జాతీయ చిహ్నం ఉన్నది. కాగా ఎంపీలందరికీ బడ్జెట్ కాపీలు చదువుకునేందుకు.. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ను మంత్రి సీతారామన్ ఆవిష్కరించారు.
ప్రజల అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ : కేంద్ర మంత్రి అనురాగ్
2021-22 బడ్జెట్ ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ‘సబ్‌కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ నినాదాలు మోదీ ప్రభుత్వ అజెండా అన్నారు. బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు కేంద్రమంత్రి తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు.